ఆషాడం (కైతికాలు)--కాటేగారు పాండురంగ విఠల్ , హైదరాబాద్

కొత్తగ పెళ్ళైన జంట
ప్రేమలో విహరిస్తారు
ఆషాఢమాసపు వేళ
విరహమనుభవిస్తారు
వారెవ్వా నవ్య బంధము
మధుర జ్ఞాపకాల తోరణము

పాలకడలిపై పడుకొని
యోగనిద్రలో కెళ్లును
ఏకాదశినాడు విష్ణు
భక్తులను కరుణించును
వారెవ్వా సహస్రనామ రూపుడా
శతసహస్ర వందనాలు గైకొనుమా

గురువు సకల జ్ఞాన ఖని
సన్మార్గము చూపించును
గురుపౌర్ణిమ శుభదినము
పూజలను ఆందుకొనును
వారెవ్వా విజ్ఞాన తరువు
చదువుల కల్పతరువు

వేద భూమిలో పుట్టెను
వేదాలను రాశాడు
ఆషాఢ పున్నమిరోజు
వ్యాసముని జన్మించాడు
వారెవ్వా సనాతన ధర్మమా
మహర్షులకు నిలయమా!

ఖగోళ శాస్త్ర నియమము
అధిక ఆషాఢ మొచ్చును
విగ్రహాల ఖననము
పూరీలో జరుగును
వారెవ్వా జగన్నాథా
భక్తజన వర ప్రదాతా!

ఆడవారికిష్టము
చేతికి గోరింటాకు
అషాఢాన ప్రతి ఒక్కరు
పెట్టుకుంటరు చేతులకు
వారెవ్వా సదాచారము
పడతులకిది శుభకరము.

కామెంట్‌లు