సినారె సాహితీ పురస్కారం అందుకోనున్న డా. చిటికెన

 కళా నిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభ హైదరాబాద్ వేదికగా ప్రముఖ రచయిత, వ్యాసకర్త  డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు సినారె సాహిత్య పురస్కారం ప్రముఖుల చేతుల మీదుగా శనివారం ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి న్యూఢిల్లీ ఎస్ వేణుగోపాల చారి,   విశిష్ట అతిథి గా సుంకర సత్యనారాయణ విశ్రాంత డిసిపి, సభాధ్యక్షులు గా డా. యం. కె. రాము, గౌరవ అతిథులుగా తె. ర. సం. అధ్యక్షులు నాలేశ్వరం శంకరం, ప్రజాపతి కె.  వీర భోగ వసంత రాయలు, సంఘ సేవకులు సాహితీవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 
      ఈ సందర్భంగా డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి 90 వ జయంతి సందర్భంగా సాహితీ పురస్కారంనకు ఎంపిక కావడం వల్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు డా. చిటికెన ను  అభినందించారు.

కామెంట్‌లు