నాయనా శివాజీ!
మనదేశపు హిందూధర్మ దేవత
కంటికి కడివెడి నీరుగా దుఃఖించుచున్నది.
కోటానుకోట్ల వీరపుత్రులు కలిగిన నేను ఈనాడు ,సుల్తానుల,నవాబుల, మ్లేఛ్ఛుల చెరబడితిననుచూ,
తన అవమానానికి కారకులైన
ఈ దుష్టులను తెగనాడి, తన సంపూర్ణస్వాతంత్ర్యినికి పాటుపడే ఒక్కడంటె ఒక్క బిడ్డడు లేడా అనుచూ ఆమె
మనహిందూ ధర్మదేవత కంటికి కడివెడు నీటితో పరితపిస్తున్నది.
నాయనా శివబా!మీ నాయన షాజీ అరివీర భయంకరుడు అయినప్పటికినీ, హిందూధర్మాన్ని అణగద్రొక్కుతున్న,అవహేళన చేయుచున్న ,అంతముచేయబూనిన ఆ నవావాబుల కొలువులో నాతండ్రివలెనే, నీతండ్రికూడా ఆ నవాబులు ఎరవేసిన భోగాలకూ,సిరిసంపదలకూ ఆశపడి సైన్యాధికారిగా ఊడిగంచేయ వద్దనీ, మనకున్న పరగణాలను పాలించుకొంటూ సుఖంగా వుందామని అనేక విధాల బ్రతిమిలాడినా పెడచెవినిపెట్టి,
నిండుగర్భిణినైన విడచిపెట్టి, నాతొలుచూలుబిడ్డ,నా శంభూజీని నావడినుంచి వేరుజేసి నీ హిందుధర్మం,నీహిందూమతాన్నీ నీనెత్తిన పెట్టుకు ఊరేగమని
నిర్లక్ష్యగా వెళ్ళిపోయేరు.
ఆసమయంలో అనాధలా అలమటిస్తున్న నన్ను కన్నతండ్రికన్నమిన్నగా,
ఆదరించిన దాదాజీఖండదేవ్,ఈనాడు నీకు తాతగా,గురువుగా నీభవితను చక్కదిద్దుటయేగాక,నీద్వారా హిందూ ధర్మాన్ని పునరుత్తేజపరచి,యావత్ భారతంలో హిందూరాజ్యం నెలకొల్పవలెనని ,హిందూ ధర్మానికి పునరుత్తేజం తేవాలనీ వేయికళ్ళతో ఎదురుచూచుచున్నారు.అద నీఒక్కడి వల్లనే అవుతుందని మన ఇలవేల్పు తుల్జా భవానీమాతతోపాటుగా కోట్లాది హిందువులు అందరూ కనులలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాము శివా
మా ఆశలు నెరవేర్చు శివా
నీ దుష్టులను పరిమార్చి నీ జన్మభూమి ఋణం తీర్చుకో శివాజీ
ఈ నీతల్లి జిజియా కోర్కెను తీర్చుతావుకదూ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి