.ఊరు (బాల గేయం.)...:-బొమ్ము విమల

ఊరు పక్కన ఉన్నది
 కలువ పూలచెరువు
 చెరువు గట్టు కున్నది 
చింత చెట్టు ఒక్కటి
 చెట్టు పైన కోకిలమ్మ 
కుహూ అంటు పాడగా
 చెట్టు కింద నెమలమ్మ
 పురి విప్పి ఆడుతుంటే
 చెరువు లోని తామరలు 
విర బూసి నవ్వగా 
ఆకుమీద నీటి చుక్క
 ముత్యమోలె మెరువగా 
నీటిలోన చేప పిల్లలు 
ఎగిరి దూకు చుండగా 
కొంగ ఒకటి వచ్చింది
 చేపలతో కూడి ఆడింది