పింగళి వెంకయ్య. అచ్యుతుని రాజ్యశ్రీ

 జులై 4న ఒక మహానుభావుడు   ఎన్నో  బాధలు పడుతూ 1963లో మరణించిన సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఆయనే జాతీయ పతాక నిర్మాత  ఆచార్య  పింగళి  వెంకయ్య గారు. నిరాడంబరంగా దేశభక్తి తో బతికిన  ఆయన82ఏళ్ళ వయసులో  ఆర్ధిక  కంటి చూపు సమస్య తో విజయవాడ  లో చిన్న ఇంటి లో గడిపారు .తన మృతదేహం పై కప్పిన జాతీయ పతాకాన్ని  స్మశానం దగ్గరున్న  రావిచెట్టు కి కట్టమన్న  కోరిక  ఒక్కటే తీరింది. 1906నుంచి 1922వరకు దేశస్వాతంత్ర ఉద్యమం లో  పోరాటంలో  పాల్గొన్న ఆయనకు  అవినీతి  పైరవీలు  అంటే అసహ్యం.  బందరు ఓడరేవు పునరుద్ధరణ కూడా ఈయన చలువే.1960లో ఖనిజసలహాదారు పదవినుంచి  తొలగించటం దారుణం. తన పిల్లల చదువు ఉద్యోగం కోసం   ఎవరి సిఫార్సు ఆశించని అభిమానవంతుడు.ఆగస్టు 2  1878లో కృష్ణాజిల్లా  భట్లపెనుమర్రులో పుట్టారు.  హైస్కూల్ చదువు కాగానే  బొంబాయి వెళ్లి  సైన్యంలో చేరి 19వ ఏట దక్షిణాఫ్రికా వెళ్లారు.  భారత్ తిరిగి వచ్చాక  బళ్ళారిలో ప్లేగు వ్యాధి నిరోధక అధికారి గా పనిచేశారు.  పైచదువులకోసం  కొలంబో వెళ్ళి  కేంబ్రిడ్జ్ సీనియర్ పాసై తన26వ ఏట లాహోర్ లో దయానంద ఆంగ్లో వైదిక కళాశాల లో చేరారు.
 అక్కడ జపనీస్  సంస్కృత ఉర్దూ లో పండితులైనారు.ఆయనని జపాన్ వెంకయ్య అని పిలిచేవారు. మునగాల రాజావారి ప్రోత్సహంతో పత్తి విత్తనాలపై పరిశోధన చేశారు. కంబోడియా పత్తితో సన్న నూలు సాధించి పత్తి వెంకయ్య గా గణుతికెక్కాడు.  చెరకు  పొగాకు  పత్తి పరిశోధన కు బంగారు పతకం పొందారు. లండన్ రాయల్ అగ్రికల్చరల్ సొసైటీలో సభ్యత్వం పొందిన  తొలి భారతీయుడు.1911నుంచి 1919దాకా  బందరు జాతీయ కళాశాలలో చరిత్ర  గుర్రపు స్వారి వ్యాయామం  బోధించేవారు. 1912లోనే ఏంచెప్పారో తెలుసా?చైనా  భారత్ పై దాడి చేస్తుంది అని దలైలామా టిబెట్ నుంచి  పారిపోవాల్సి వస్తుంది అని  జోస్యం చెప్పిన మేధావి. 1916లో తెలుగు  ఆంగ్ల ఉర్దూలో భారత్ కి జెండా ఉం డాలి అని ఉపన్యాసాల తో అదరగొట్టి 1916 లో తనజెండాని రెపరెప లాడించాడు.1మే రోజునాగపూర్ లో ఈ జెండా ని ఊరేగించరాదని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.  పటేల్ నాయకత్వం లోఆసత్యాగ్రహం విజయవంతమైంది. రాజకీయాల నించి  తప్పుకుని  మద్రాసు  ప్రెసిడెన్సీకాలేజీలో భూగర్భ ఖనిజాలపై పరిశోధన చేసి డిప్లొమా పొందారు. మన దేశం లో ఏఖనిజం రాష్ట్రంలో  ఏజిల్లా ఏ ప్రాంతంలో దొరుకుతుందో చెప్పినమేధావి  .కేవలం జెండా నిర్మాత గా తెలుసు కుని ఊరుకుంటాం.మరుగున పడిన  ఆయన బాధలు కష్టాలు వెలుగులోకి రాకపోటం దురదృష్టం.

కామెంట్‌లు