వచన కవిత్వం లో -నూతన ప్రక్రియ....ఆన్షీలు*:-డా.కె.ఎల్.వి.ప్రసాద్హన్మకొండ .

  1) నాలుగు పాదాలు వుండాలి
  2)నాలుగవ పాదం స్వంత మకుటం
    వుండాలి.
  3)ఛందస్సు వంటి నియమాలు 
    వుండవు.
   4)అర్ధవంతంగా వుండాలి. 
    5)ఒకే అంశంతో వరుస క్రమంలో
    రాయాలనే నియమం లేదు
                  
     6)ప్రాస వుంటే బాగుంటుంది.
                ************
               
                  
                   
జీవనరాగం ...!!              (ఆన్షీలు)
-----------------------------------------------
 పదవి అధికారమునకై పార్టీలు మార్చుపెద్దలు 
ప్రజలుకనపడగానే ప్రవచింతురు సుద్దులెన్నో 
స్వంతలాభమునకై దేనికైనా సిధ్ధమే వీరు....!
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------
నేటి ప్రతిప క్ష నాయకుడు రేపు మంత్రి కావచ్చును
నిన్నటి కీలకమైన మంత్రి నేడు వామపక్షముకావచ్చు
స్వార్థపరుల చదరంగపుటాటలో ఓటరుబలిఅయ్యె
వినుము కె.ఎల్వీ.మాట  నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------
అధికారము వచ్చు వరకు ప్రజలు (ఓటరు)దేవుళ్ళు 
ఆపైన ఐదుసంవత్సరాలు ఎవరెక్కడో తెలియదు 
ప్రజాసేవకునేటి అర్ధము పలుచబడిపోయే గదా ..!
వినుము కె.ఎల్వి.మాట నిజము  సుమ్ము...!!
----------------------------------------------------------------
ప్రజాధనము వెచ్చించిఎన్నో  పథకాలు ప్రవేశపెట్టి 
నాయకుడి పేరుతో నడిపింతురు ప్రజలమద్య 
ఎవడబ్బసొమ్మని ఈ వెర్రివేషాల చేష్టలు ...
వినుము    కె.ఎల్వీ.మాట  నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
ఎన్నికలబరిలోదిగి ప్రజల మనసును ఆకట్టుకొని
కల్లబొల్లి కబుర్లతో,కట్టుకథలతోఓట్లు వేయించుకుని
ఎన్నికైన మరుక్షణము కండువాలు మార్చెదరు కదా!
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము సుమ్ము.....!!
---------------------------------------------------------------
పాలకులుచెప్పు అభివృద్ది ప్రధాన మార్గాన కన్పించు
కాలనీల లోపల చూడ మురికికాలువల ప్రవాహం 
ప్రజలు నోరు విప్పి ప్రశ్నించు స్వేచ్చ కరువాయెగా 
వినుము  కె.ఎల్వీ. మాట  నిజము  సుమ్ము....!!
---------------------------------------------------------------

కామెంట్‌లు