విద్య:-మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 1.
చక్కనైన తల్లి శారదాదేవికి
నిండు మనము తోడనిడుదు ప్రణము
కవిత ధారనిమ్ము కమల నేత్రి జనని
కవితలల్లి నీకు గలమునేతు.
2.
గురువు విద్య నిచ్చి గుర్తింప జేయును
చెడ్డ పనుల నెన్నొ చెరిపి వేయు
కుమతి బుద్ధిమాన్పి కుదురుగా జేయును
అతడె గొప్ప శిల్పియవని యందు.
3.
శ్రద్ధ యున్న చదువు చక్కగా నేర్చేవు
రాణి దేది లేదు రాజ్యమందు
ఘనుడవైయ్యి కీర్తి జగములో పొందేవు
శ్రద్ధ తోడ వినుము సత్యమిదియు.
4.
పట్టుబట్టి చదువ బంగారు బ్రతుకౌను
శ్రద్దతోడ చదువ బుద్ధి పెరుగు
రక్తి లేని నాట రాణించదెపుడు
సారమెరుగ వలెను సర్వ జనులు.
5.
తెలివి యున్న వాడు దేశానికే వెల్గు
ధర్మ రక్ష జేయు ధాత్రినతడు
ధర్మ రక్ష తోడ ధరనెల్ల శుభమౌను
వారి పేరు నిలుచు వసుధయందు.
కామెంట్‌లు