అనురాగాల తెలుగుగడ్డ
ఆత్మీయతల తెలుగుగడ్డ
మమకారాల తెలుగు గడ్డ
మమతలతల్లి తెలుగు గడ్డ
//అనురాగాల//
దేశభక్తి తెలుగుగడ్డ
విశ్వాసాల తెలుగుగడ్డ
విలువలున్న తెలుగుగడ్డ
చైతన్యస్ఫూర్తి తెలుగుగడ్డ
// అనురాగాల //
ఉద్యమస్ఫూర్తి తెలుగుగడ్డ
సత్యాగ్రహాల తెలుగుగడ్డ
భాను తేజం తెలుగుగడ్డ
కాంతి రూపం తెలుగుగడ్డ
// అనురాగాల //
సంస్కృతి నిలయం తెలుగుగడ్డ
సాహిత్య ప్రియం తెలుగుగడ్డ
ధైర్యం నిండిన తెలుగుగడ్డ
క్రమశిక్షణ కలిగిన తెలుగుగడ్డ
// అనురాగాల //
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి