గజల్ :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

గుండెల్లో భావాలను దాచుతున్న కనురెప్పలు 
శోకజలధి ముత్యాలను జార్చుతున్న కనురెప్పలు 

సుఖియే పంచిన భావన దుఃఖితుడెట పంచగలడు 
అనుభవాలు దారాలను  అల్లుతున్న కనురెప్పలు 

చేదునిండి జీవితమే జీర్ణమయే స్థితిలేదు 
అరగలేని బంధాలను వదులుతున్న కనురెప్పలు 

కీర్తికన్య నడినెత్తిన కిరీటమై అమరుతుంది 
లోలోపల క్లేశమణులు పొదుగుతున్న కనురెప్పలు  

అధికారం చెలగాటం అన్నిటికీ సాగదిపుడు 
ఒదిగివున్న తరుణాలను మెచ్చుతున్న కనురెప్పలు 

నీలాకాశం నిండుగ నిరాశయే మిగిలిందిక 
భోళా శంకరుడల్లే వాలుతున్న కనురెప్పలు 

నియమంతప్పిన మనిషికి నీతిఎలా తెలుసు ఉమా 
 కఠినమైన కాలజ్వాల మండుతున్న కనురెప్పలు!!

కామెంట్‌లు