శరణు శరణు గణేశ
శరణు శ్రీ గణేశ
శరణన్న వారిని
ఆదుకునే గణేశా
// శరణు ///
పార్వతి తనయా గణేశా
శంకర తనయ గణేశా
పసుపు ముద్దగా వెలసిన
శుభాలనిచ్చే గణేశా
//శరణు //
భద్ర పద శుక్ల పక్షమున
అవతరించిన ఆదిగణేశా
తొలి పూజలు చేసేదనయ్య
విఘ్ననాయక గణేశా
//శరణు//
విద్యా నాయక గణేశా
సిద్ధి బుద్ధి గణేశ
ఉండ్రాళ్ళ పాయసం గణేశా
ప్రీతితో పెడతాము గణేశా
//శరణు///

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి