దేశప్రేమికులు. ..అచ్యుతుని రాజ్యశ్రీ

 మరాఠా సర్దార్ అంబాజీ పుంగలియా ఉదయపూర్ ని ముట్టడించాడు. మేవాడ్ మహారాణా  నగరద్వారాలన్నీ మూసేయించాడు. రాణా కాళ్ల బేరానికి వచ్చి సంధి చేసుకుంటాడు అనే ధీమాతో ఉన్నాడు అంబాజీ. నెలగడిచినా యుద్ధసూచన సంధిప్రస్తావన లేకపోటంతో  తన విశ్వాసపాత్రుడైన సేవకుడు డిండోల్కర్ ని పిలిచి"మనం ఎలాగైనా నగరంలోకి ప్రవేశించేలా చూడు"అని ఆదేశించాడు.
డిండోల్కర్ బైట నించే ఆనగరం చుట్టుపక్కల పరిశీలించాడు.మూడువైపుల దృఢమైన గోడలు  ఓవైపు పెద్ద వాగు నీటితో నిండి ఉంది. ఆవాగు ద్వారా  నావలు  నగరం  లోపలికి ఆహారపదార్థాలు సరఫరా చేస్తాయి.అతను ఈవిషయాన్ని  అంబాజీ కి చెప్పాడు. ఆహారం  నిత్యావసరాలు లోపలికి  పోకుండా  చూడాలి.అది అంతతేలికైన పనికాదు. తాము వాగులో పడవల ద్వారా  నగరంలోకి ప్రవేశించేలా అంబాజీ  పధకంవేశాడు.మహారాణా  కి పడవలను తయారు చేసే దేవాలీగ్రామవాసులను కలిసి "మాకు ఇరవై పడవలు కావాలి. మీరు  కోరినంత డబ్బు ఇస్తా "ఆశపెట్టాడు. డబ్బు కి లోకం దాసోహం. నావలు తయారు అయినాయి.  అంబాజీ  మరాఠా వీరులతో కలిసి ఆ నావలో అర్ధరాత్రి   వాగు దాటుతుంటే  నావలకి చిల్లి పడి నీరు లోపలికి ప్రవేశించింది. వాగుమధ్యలో ఉన్న  మరాఠాలు  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  ఒడ్డుకు ఈదారు.ఆశ్చర్యం! మహారాణా  నవ్వుతూ  వారికి  స్వయంగా  స్వాగతం పలికాడు. శత్రుసైన్యానికి  బస తిండి తిప్పలు ఏర్పాటు చేశాడు. ఆమర్నాడు అంబాజీని  భోజనానికి  ఆహ్వానించాడు. అంబాజీ  కన్నుల వెంట  బొటబొటా  కన్నీరు కారసాగింది."ప్రభూ!మీరు  మీప్రజలు ఇంత  ఉదారులని అనుకోలేదు. శత్రువు ని ఆదరించే మీరు  ఎంత గొప్ప వారో నాకు  అర్ధం అయింది. "
రాణా అన్నాడు"అంబాజీ!మా మేవాడ్ వాసుల వద్ద సైన్యం  దేశభక్తి తప్ప  ఏమీలేవు. మాప్రజలే మాకు అండదండలు. "   అంబాజీ  సిగ్గు పడుతూ అన్నాడు "మాకు  పడవలు తయారు చేసిన వారు కూడా దేశభక్తులేసుమా!అందుకే  మేము ఎక్కిన కాసేపటికి  తూట్లు  చిల్లులు పడి మేమంతా  నీటిలో దూకేలా చేశారు ఆదేశభక్తులు!"అన్నాడు.  ఆనాటి  మేవాడ్  గొప్పతనం  ఇప్పటికీ  కథలు కథలుగా  పాటల రూపంలో  పాడుకుంటారు. మనం  ఆచరిత్రను తెలుసు కోవాలి. ఉత్తర భారత దేశం ఎన్నో బాధ లు కష్టాలు  దండయాత్ర లతో  అతలాకుతలం  అయింది. సైన్యం లో కూడా  వారి  సంఖ్య ఎక్కువ. మరి ఇప్పుడు చెప్పండి వారి లాగా మనం ఇన్ని ఆటుపోట్లను  ప్రకృతి బీభత్సం ను ఎదుర్కొంటున్నామా? పుణ్యధామాలన్నీ నార్త్ లోనే  ఉన్నాయి.అందుకే  ఇప్పుడు మనందరికీ  దేశం పట్ల మంచి అవగాహన  రీతి రివాజులు తెలుస్తున్నాయి. మనపుణ్య కర్మభూమి కురుక్షేత్ర అందుకే  భగవద్గీత కి కేంద్రం అయింది.
కామెంట్‌లు