నిత్యనూతనం (బాలల గేయం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
కంప్యూటర్ కాలం వచ్చింది
సెల్లులు చేతికి ఇచ్చింది
టచ్ చేసిన కదిలింది 
ఎంతో విజ్ఞానం తనదంది

మెసేజులు చదవ మంది 
మెసేజులు పెట్ట మంది 
సృజనాత్మకత పెంచుమంది 
మిత్రులనే పొందుమంది 

వీడియోలు చూడుమంది
వీడియోలు తీయ మంది
నైపుణ్యాలను పెంచుమంది 
నిత్యనూతనంగా మారుమంది.