9)
అలానడిచి పోయెను రోజంతావేగమున
ఆగిచూస్తే ఉన్నారు అడవిలోన
అక్కడున్నారు దుర్జయులను తెగవారు
వారు అత్యంత క్రూరులు!
10)
దుర్జయులు కారు మంచివారు
పక్కనున్న జనపదముల దోచుకునేవారు
దోచుకుందురు పంట గాదెలు
దోచుకుందురు రమణుల శీలములు!
11)
ఆరాత్రి ఒకమానిని రోదించె
మనవీరులకు అది వినిపించె
అప్పుడేవీరికి దుర్జయులు ఎదురుపడ్డారు
వీరు వారిపై ఎగిరిదూకారు!
12)
అధికుడు అప్పుడు గదచేబూనాడు
అప్పుడు వారితో కలబడినాడు
అల్పుడు ఎగబాకెను మెల్లగా
కొందరి కుత్తుకలనుకోసె చల్లగా!
(సశేషం)
*స్నేహితులు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(మూడవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి