సింగిరెడ్డి నారాయణ రెడ్డి(కవన పుత్ర)జె.నిర్మల-సిద్దిపేట

 సీ.ప
హనుమాజి పేటను యలరింప జేసిన
సాహితీ కృషిలోన చతురు డతడు
సింగిరెడ్డిరచన చిత్రసీమలొ వెల్గె
నిత్య చైతన్యుడై నేర్పరుడిగ
కారణజన్ముడై కలియుగ మందున
వివిధ రచనజేసె విజ్ఞుడతడు
పరిశోధనలు జేసి ప్రాజ్ఞుడై విలసిల్లి
చరితను సృజియించె సదయుడతడు
తే‌.గీ
ఎన్ని జన్మల పుణ్యంబొ యేమొగాని
తెలుగు భాషకె వన్నెతో వెలుగు నిచ్చి
మనసు దోచిన మహనీయ మాన్యుడుగను
కవులకాదర్శ  మైతివీ కవన పుత్ర
మరువ రెప్పుడు మిమ్ముల మదిలొ నిల్పి
కందం:
ఘనమైన రచనలెన్నో
అనుదినము సినారెజేసి యవనిన వెల్గెన్
మనిషికి నోపిక నుండిన
వినయముగ జేయుపనులు విజయము గూర్చున్
కామెంట్‌లు