సప్త సముద్రాలు దాటినట్లు
బాల్యం యవ్వనం కౌమారం నుంచి
వార్ధక్యంలో కి తొంగి చూశాక
అపశృతులు ఇంకా మోగుతూనే ఉన్నాయి.
ఓర్పు నేర్పు ల బడి బాట నుంచి
ఉరుకులు పరుగుల ఉద్యోగపర్వంలో
అధ్యాయాలు ఎన్ని తిరగేసిన
అర్థం కావడం లేదు జీవితం.
సమస్యల తోరణాలు వేలాడుతూనే ఉన్నాయి.
పరిష్కారాలు వెతికే కొద్దీ పర్వాలు
దాటుకుంటూ పోయినా
చీకటి దృశ్యాలు ఎదురు తప్పడం లేదు.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు
అనుబంధాల తోటలో విరిసిన పువ్వులు
ఒక రేకులు విడిపోతున్నాయి.
కాంక్రీట్ వనంలో కలుపు మొక్కలుగా
వృద్ధాశ్రమాలు వేలు స్తుంటే
పనికిరాని పాత వస్తువుల్ని వేసినట్లు
అమ్మానాన్నలకు బహుమతిగా
ఆశ్రమంలో సీటు సంపాదిస్తారు.
పేగు బంధాలు ప్రేమ బంధాలన్ని
మారిపోయే పేకమేడలు ద్వి ముఖాలతో నడుస్తున్నారు.
ఒంటరితనం అయినా పర్వాలేదు
వాట్సాప్ లో వెంట ఉంటే చాలు.
పండుగలు పుట్టిన రోజులు అన్ని అందులోనే.
మమతాను బంధాలు దూరపు కొండలు అయ్యాక
చెదిరిపోయిన పాత గుళ్లకు వెల్ల
పోసుకోవడానికి తల్లిదండ్రుల దగ్గరకు
ఆశ్రమ వారసులుగా ఏకాకి లా వచ్చి వాల వలసిందే.
తరతరాల తప్పుడు లెక్క ఎక్కడికి పోతాయి.
అప్పుడు అవగాహన అవసరం.
సమయం మించి పోయాక
బ్రతుకు పాఠం నేర్చుకుంటే ఏం లాభం.
ఇలా చేయటం నేరమే కదా
ఆలోచించాల్సిన రోజు రానే వస్తుంది
ఆలోచించాల్సిందే. :-తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి