సుడి గుండాల జీవనయానం , :-వై నీరజారెడ్డి జడ్.పి.హెచ్.ఎస్ కుకునూర్ పల్లి మండలం కొండపాక


అలుపెరుగని పోరాటం, 
బంధాల కోసం ఆరాటం,
 బతుకు పోరాటంలో చెలగాటం. 

ఊగిసలాడే ఊపిరి తో, 
రంగులు మారే లోకం లో, 
అంతే తెలియని ఆరాటంతో ,
బతుకు బాటలో పయనం. 

కాలానికి తెలుస్తుందిలే, 
బ్రతుకును అందించడమా,
చావుతో ముగించడ మా 
,విధి లిఖితమే ఈ జీవితం. 

కనులెర్రజేసిన ప్రకృతి, 
శాంతి రూపాన్ని ధరించి, 
తల్లిలా ఆదరించే వరకు,
 ఆశతో ప్రాణాలను కాపాడుకుందాం. 

కామెంట్‌లు