ఉత్తమగుణం(ఇష్టపది (డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.
దానమిచ్చిన చాలు దామోదరుని ప్రీతి
సహాయం చిన్నదై స్వాంతనకు పెద్దదై

సేవతో కలిసినా సేమమును కోరినా
అర్థులకు అభయమును దాతలకు పుణ్యమును

భగవంతుడు మెచ్చెడి భాగ్యముగా వచ్చెడి
కలియుగంలో కాంతి కాలాలకు ప్రశస్తి

కష్టకాలంలోన కాచెడు వరముగాను
ఉన్నత గుణముగాను ఉర్విమీదను పేరు