*తెలంగాణ తేజం* :-*వరుకోలు లక్ష్మయ్య* *సిద్ధిపేట*
********************
*సీసమాలిక*
********************
పలు భాషలను నేర్చిబహుగ్రంధ రచనలు!
వ్రాసియందించినపండితుండు!
అజ్ఞాన తిమిరాన్నియణగద్రొక్కుచునాడు
విజ్ఞాన వీచికైవెలిగె నతడు! 
నైజాము రాజులనడ్డిని విరుచుచు! 
కోరలు పీకినకోవిదుండు! 
సాహిత్య సమరానసమరశంఖమెనూది!
స్వేచ్ఛతో తిరుగాడుసింగమతడు!
అన్యాయ మెచ్చోటనాటాడు చుండునో!
ఉగ్రుడై నచ్చోటనురిమునతడు!
విప్లవకణికయైవిద్యుల్లతనువోలె
సవ్యసాచిగపోరుసలిపె నతడు!
నాదు తెలంగాణనవనవోన్మేషియై!
తేజరిల్లగజేసెధీరుడతడు! 
సాహిత్య మెందాకసాగునో నందాక!
అగ్గిపెట్టెదననియరిచె నతడు! 
సాయుధ పోరులోనాయుధము ధరించి!
పోరాడి గెలిచినవీరుడతడు!
ఆ రజాకారుల నాగడమ్ములనన్ని!
యెండ కట్టినయట్టిదండి యతడు!

*తేటగీతి*
కృష్ణమాచార్యచిరకీర్తినృపులనణచె!
యీ తెలంగాణ వెల్గుకృషీవలునిగ!
ప్రజలహృదయాంతరంగానవాసికెక్కి!
దాశరథిగతా నమరుడైధాత్రి నిలిచె!
*********************


కామెంట్‌లు