ఇప్పుడు --
నేను .....
నేనుగానే వున్నాను !
నా అభిప్రాయాలూ
నా వ్యక్తిత్వం …
ఏమీ మారనేలేదు !
నీతీ -నిజాయితీ
నిఖ్ఖర్చితనం
సూటిదనం
ఏమీ మారలేదు .. !
కానీ ---
ఈ వార్ధక్యం అంచులో
నా ఆలోచనలూ -
అభిప్రాయాలూ
ఎవరికీ ......
అక్కరలేని జీవితం ఇది !
అయినా ---
నాలో నేనూ ….
నా ఆత్మలో నేనూ
నాకై నేను
లీనమవుతున్నా !
ప్రభూ .. నీ పిలుపుకై
వేచివున్నా …. !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి