మనోహర రూపం,వర్షంలో మురిసిన బాల్యం(తేటగీతి పద్యాలు)డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

      :మనోహర రూపం:
ముగ్ధ రూపము గల్గిన ముదిత గాంచి
దగ్ధ మగునట్టి మనసును దాచి పెట్టి
స్నిగ్ధ సునయన చూపులు సిద్ధ పరచ
దుగ్ధ రేపెను మదిలోన‌ దుండి రూపు

    :వర్షంలో మురిసిన  బాల్యం:  
కత్తి పడవల వదలను కాంక్ష తోడ
బడిని వదిలిన వేళను భాగ్య మవ్వ
చేసి వేసెడు సరదాలు ముద్దు గాను
బాల్య చాపల మధురము బాగు గాదె
కామెంట్‌లు