జీవనరాగం ....!! (ఆన్షీలు):-డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ .

 ఒకనాఁడు పెద్దలు చూసి కుదిర్చిన పెళ్లిళ్లు 
గుట్టుగా సంసారమును నెట్టుకొచ్చే వి ....!
పాపపుణ్యాలన్నీ పెరుమాళ్ళుకే తెలిసెడివి 
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము...!!
---------------------------------------------------------------
పెద్దల మాటలకు అందరికి  గౌరవం ఉండెడిది,
సంసార సరిగమలు లోలోపలనే అంతమయ్యెడివి
కుటుంబ పరువుకే  ప్రాధాన్యతలు ఉండెడివి ....
వినుము కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
----------------------------------------------------------------
వంటింటికే నాడు వనిత లు అంకితమైరి,
చదువు సంధ్యాలున్నాకూడా గడపదాటని స్థితి !
పిల్లలను కని పెంచు యంత్రములు పడతులన్నట్లు 
వినుము  కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము...!!
------------------------------------------------------------
ప్రేమలూ పెళ్లిళ్లు ఫ్యాషనై పోయె నిపుడు 
ప్రేమంటే తెలియకనే పెళ్లికి సిద్దమైపోవుదురు 
క్షణమైనా ఒపికలేక కయ్యానికి కాలుదువ్వుదురు 
వినుము కె.ఎల్వీ. మాట  నిజము  సుమ్ము....!!
---------------------------------------------------------------
మగవారితో సమానముగా ఉద్యోగముచేయు
నేటి మహిళలిప్పుడు అన్నింట  సర్వస్వతంత్రులైరి!
చిన్ని సమస్యలకే ఒపికలేక విడాకులవెంటపరుగులా  
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
----------------------------------------------------------------
పెళ్లిళ్ల పేరయ్యల ఉనికి కరువైపోయే నేడు
మ్యారేజి బ్యూరోలు కుక్క గొడుగులయ్యేచూడు,
ఏదీ నమ్మలేని పరిస్తితులు  దాపురించే గదా ...!
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
--------------------------------------------------------------
గుణవంతుడైన అల్లుడు దొరుకుట అదృష్టమేలే ..
అనుకూలమైన కోడలు లభించుట పూజాఫలమే !
పెళ్లిళ్ల ఊసులన్నీ దైవనిర్ణయాలే కాఁబోలు ....
వినుము కె.ఎల్వీ. మాట నిజము  సుమ్ము.....!!
----------------------------------------------------------------
పెళ్ళివిలువ తెలియని పురుషపుంగవులు కొందరు 
భార్య అనిన ఆటబొమ్మ అనుకొందురు ఎందుకో..!
మహిళామణులుకూడా తీసిపోరు భర్తల విషయాన 
వినుము కె.ఎల్వీ. మాట  నిజము   సుమ్ము ...!!
----------------------------------------------------------------

కామెంట్‌లు