సృజన సౌందర్య సుందర సౌజన్య
సుధా వర్షంబగు సాటి మేటి భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
2)మకరంద బిందు సింధూర సుందర
ఒంపు సొంపుల ఒనమాల తెలుగు
మాధుర్యంబు వినరా తెలుగు బిడ్డా
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
3)ఒగ్గు గాధల గుబాలింపుల ఒంపు
సొంపుల సుందర జుమ్మంది నాదంబుల
అనంత మాధుర్య మధురిమ ఒనమాల భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
4)సౌమ్య దేవ్య హవ్య సవ్య
తొవ్వ సేవ్య భావ్య దివ్య
నవ్య భవ్య శ్రావ్య కావ్య భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
5)నంద్య వింద్య సంధ్య సారధ్య
వైద్య సేద్య వేద్యా చోద్య
హృద్య విద్య పద్య గద్య భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి