*నగరాలలో *జల భీభత్సం*:-*" రసస్రవంతి " & " కావ్యసుధ "*- *కవిద్వయం* : *హైదరాబాదు*
గాలివాన, మేఘమాల లాకసమంత
ఆవిరించి ఘర్జనమ్ము జేయ
మెరపు మెరసి పిడుగు ధరణి పైన బడగ
నేల మట్టమాయె నిండ్లు చెట్లు

 నీటి వరద వచ్చి నిమిషాలలోననే
 కాలనీలు మునిగి కడలియాయె 
 ఇండ్లు నీట మునిగి,ఇబ్బందు లెదురాయె 
 నింగి నేల కలసి అంగలార్చే

 వరదలెన్నో వచ్చి వరి చేను  లను ముంచె
 కాయగూర మడులు మాయమాయె 
 త్రాగ నీరు లేదు రేగె నాకలి మంట
 పోగ దారి లేక పోయె నెటకు

 కుంభవృష్టి వల్ల కూలెను భవనాలు
 నీరు నిలువ కనుల నీరు దొరలె
 అచ్చటచ్చటంత ఆగమాగమ్మాయె 
 ఏమి తోచదాయె నెవరికైన

 మోరీలు పొంగి పొర్లుత
 లారీలను, కార్ల, జీబులన్నిటి నెల్లన్
 పారే జలమున కల్పుతు
 దూరాలకు నెట్టు కెళ్లే దొర్లే జలముల్

 టీవీలు ఫ్రిజు లన్నియు
 టూవీలర్ లన్ని,చెడెను డూయల్ బెడులున్
 దేవతల చిత్ర పటములు
 కావలసిన పైకమంత గల్లంతాయెన్

 నిలయమ్ములలో నిలువై
 విలువగు సామాగ్రియంత విలయము పాలై
 పలు కాపురమ్ములందున
 వెలకట్టగరాని నష్టం మెంతో జరిగెన్.


కామెంట్‌లు