*సీసమాలిక*
దేశానికంతనుదేదీప్యమానమై
పట్టుకొమ్మలునయ్యె పల్లెలన్ని
కులవృత్తులన్నియు కలిసియు పనిజేయ
ఐకమత్యముగుండె నవనిజనులు
రైతులుకష్టించి రత్నాలపంటను
పొలమునంతనుదున్ని పొందిరపుడు
పంటలుపండించి పదలంగ దాచేది
ముందుకరువునెంచి మూటగట్టి
కుమ్మరివారంత కుండలుజేసివ్వ
నూరిలో పండుగల్ జోరుసాగు
వడ్రంగి,కమ్మరి పనిముట్లుజేసియు
నిల్లిల్లు తిరిగమ్ము నింపుగాను
పద్మశాలీలంత పట్టుచీరలునేసి
అగ్గి పెట్టె లబెట్టి యమ్మిరపుడు
*తేటగీతి*
నేటి కాలాన యంత్రాల పోటి పెరగ
నాటి కులవృత్తులకునేడు నరకమాయె
నరుని శ్రమతగ్గ రోగాలె నాట్యమాడ
గ్లోబలైజేషనుకులొంగె లోకమంత.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి