గలగల గుణితము (బాల గేయం) పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

 గలగల పాట పాడింది.
గాలిలో నా ఎగిరింది.
గిరగిర తిరిగి ఆగింది.
గీతలు ఎన్నో గిసింది. 
గుడి ముందు ఆగింది.
గూటిలోని పక్షి చూసింది.
గెలుపే తనది అంది
గేటు తీసి నడిచింది.
గైర్హాజరులు విడిచింది.
గొలుసులు చూసింది.
గోడల రంగులు చెప్పింది
గౌరీశంకరుని మొక్కింది
గంపెడు పండ్లు పంచింది.