గురువు( బాలగేయం)-యెల్లు. అనురాధ రాజేశ్వర్రెడ్డి తెలుగుభాషోపాధ్యాయులు సిద్దిపేట జడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి మండలం కొండపాక

 గురువు గురువు గురువు
 గురువు గురువు గురువు
 విజ్ఞాన కిరణాలు ప్రసరింపజేసి
 అజ్ఞాన తిమిరాన్నిఅంతమొందించీ
 రాయిని రత్నంగా మార్చేదిగురువు
 వినయవిధేయతలునేర్పేదిగురువు
// గురువు//

 ప్రగతి నిచ్చెనపైన ఫ్రాకించు గురువు
 అంతరంగములో ని అనుమానములు తీర్చు
 భవ బంధముల గూర్చి బోధించు గురువు
 అక్షర జ్ఞానము ఆత్మజ్ఞానమునిచ్చు
// గురువు //

సంజయుడై గురువుశాస్త్రాలు బోధించు
 హృదయ కుసుమాలు విచ్చుకునేట్లు 
 ధర్మ మార్గం వెంట నడిపించు గురువు
 పిరికితనము బాపి ధైర్యవంతుని చేయు 
//గురువు//

 విశ్వశ్రేయం గూర్చి వివరించు గురువు
 చిరస్మరణీయులు వందనం గురువులు
వందనం వందనం వందనం
వందనం గురువులు వందనం
//గురువు//

కామెంట్‌లు