కరొనతో ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. స్కూలుకి ఆఫీసులకి అన్నిటికీ సెలవులే అన్ని మూసేశారు ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.
ఎవరు బయటికి రావటం లేదు. కిరాణా దుకాణం ని నిర్ణీత సమయంలోనే తెరుస్తున్నారు. కరోనా వచ్చిన వారు ఆసుపత్రిలో చేరి లక్షలకు లక్షలు కుమ్మరించి ఆయుష్ చాలక ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరికి ఎవరు ఎవరిని పోగొట్టుకుంటారు తెలియడం లేదు. తండ్రి కొడుకు భర్త భార్య పిల్లలు ఇలా ఒకరికొకరు కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు.
ఎవరికి తోచిన సాయం వాళ్ల అందిస్తున్నారు. పప్పు బియ్యం పంచుతున్నారు. పని లేక కూలీలు రోడ్డున పడ్డారు బ్రతుకు తెరువు లేదు సొంత ఊళ్లకు చేరుకొనే లోగానే ప్రాణాలు హరి మంటున్నాయి. ప్రతినిత్యం గుడి దగ్గర అ 10 మంది బిచ్చగాళ్ళు కూర్చుని ఉంటారు 12 గంటల కల్లా వాళ్లకి భోజనం ప్యాకెట్లు అందిస్తారు. ఏదైనా పండగ పుట్టిన రోజులు పెళ్లి రోజులు వస్తే డబ్బు కట్టి ఇ బిచ్చగాళ్లకు భోజనం వండించి పెడతారు. కరుణ మూలంగా ఇప్పుడు వాళ్ళకి భోజనం కరువైంది. గుడి తలుపులు కూడా తెరవడం లేదు. ఉదయమే వచ్చి నైవేద్యం పెట్టి ఇ వెళ్ళిపోతున్నారు. గుడికి ఎదురుగా ఉన్న గురుమూర్తి కుటుంబం ఆ బిచ్చగాళ్లను చూసి జాలి పడ్డారు. వాళ్ల కింత వండి పెడితే ఆకలి తీర్చిన వాళ్ళం అవుతామని ఆలోచించారు. గురు మూర్తి గారికి ఆ పల్లెటూర్లో రెండు ఎకరాల పొలం ఉంది. ధాన్యం చేతినిండా ఉన్నాయి కానీ కూరగాయలే దొరకటం లేదు. ఉన్న రోజు ఉన్నట్లుగా భోజనం పెడుతున్నారు. ఇంటి వెనకాల పెద్ద ఖాళీ స్థలంలో తోటకూర ఏపుగా పెరిగింది అదంతా కోసి గురుమూర్తి భార్య రాజ్యలక్ష్మీ కమ్మగా పచ్చడి చేసి భోజనం పెట్టింది. ఆ పచ్చడి అన్నం అమృతం లాగా తిన్నారు అంత రుచిగా ఉంది రాజ్యలక్ష్మి చేతి వంట. మనసుంటే చాలు మార్గం దొరక్కపోదు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదంటారు. పంచభక్ష పరమాన్నాలు పెట్టకపోయినా మనస్ఫూర్తిగా సంతోషంతో పచ్చడి అన్నం పెట్టి కడుపు నింపిన చాలు అదే మహాభాగ్యం. మనం మనం ఎంత సంపాదించుకున్న మిగిలేది ఏమీ ఉండదు. పుణ్యం ఒకటే. మంచి పనులు చేయాలంటే ఒకరికి చెప్పేకంటే ముందు మనం ఆచరించాలి ఆ తర్వాత మనల్ని చూసి ఎదుటివాళ్ళు నేర్చుకుంటారు సమాజాన్ని ఉద్ధరించడం ఏ ఒక్కరి వల్ల కాదు నలుగురు కలిసి ముందుకు రావాలి ఒక చెయ్యి అందించాలి కష్టకాలంలో ఆదుకోవడం మన కర్తవ్యం. రాజ్యలక్ష్మి ఏం చేస్తున్నా అన్నదానం చూసి ఆ వీధిలోని వారు కూడా రోజుకొకరు చొప్పున ఆ బిచ్చగాళ్లకు కడుపునిండా భోజనం పెట్ట గలుగుతున్నారు. కష్టకాలంలో ఆదుకోవడం మానవత్వం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి