*గంగావతరణము* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 1)
ఓయమ్మ మాయమ్మ ఆకాశగంగమ్మ
దివినుండి భువికి అవతరించమ్మ
భూమాత రోదించె బీటలేవారంగ
కరువులే కబళించి నిలువంగ!
2)
కన్నీట మున్నీట కుమిలేమమ్మా
పాపమో శాపమో బాపవమ్మా
అనిభగీరథుడు తపము ఆచరించంగ
కరుణతో భువిపైన అవతరించెనుగంగ!
3)
విష్ణువు పాదాల ఉద్భవించింది
ఉప్పొంగి తాండవం చేసింది
తత్తకిట తాళాలు పలికాయి
మంజీర నాదాలు మోగాయి!
4)
దిక్పాలు రందరూ మొక్కినిలువంగ
సూర్యుని కిరణాలు కమ్మివేయంగ
సురలోక మంతటా సుడులుదిరిగింది
చరణాలు ఒకచోట నిలువనీయదంది!
(సశేషం)


కామెంట్‌లు