------------------
ఖాళీగా వుండకూడదు.
ఏదో ఒకటి చేయాలి.
వీలైతే ఓ కథ రాయాలి.
కవితైనా పర్వాలేదు
కుట్టుపనైనా పర్వాలేదు
కొత్త వంటైనా మంచిదే
ఖాళీగా వుండకూడదు
ఏదో ఒకటి చేయాలి
ఉద్యోగం గురించి నిర్ణయమైనా
ఏదైనా విరాళం సేకరించడమైనా
ఓ ఉపన్యాసమైనా
ఓ బ్లాగ్‌లో మన అభిప్రాయమైనా
ఏదో ఒకటి అంటే--
ఒకరి బాధని తగ్గించేది
సంతోషాన్ని వెలిగించేది
ఆకలి తీర్చేది
చలి తగ్గించి, వెచ్చదనాన్నిచ్చేది
మనం వున్న పరిస్థిని మెరుగుపరిచేది
ఏదైనా చేయాలి.
ఏది చేసినా
అది మంచిదై ఉండాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి