పాపాయి (షాడో'స్):---గద్వాల సోమన్న
తావి పువ్వులో
పాప నవ్వులో
సొగసు మోములో
అలరించే అందం గద్వాల్

పాప ఇంటిలో
తార మింటిలో
వెలుగు కంటిలో
జగమంతా సొబగులు గద్వాల్

పాప మాటలో
తీపి పాటలో
శోభ ఆటలో
కదిలే బొమ్మ పాప గద్వాల్

ప్రేమ మనసులో
నగవు ముఖంలో
ప్రమిద గృహంలో
పసిపాప ఇలవేల్పు గద్వాల్

నిజం వాక్కులో
శుద్ధి బుద్ధిలో
వృద్ధి వయసులో
కడుబడిన ముత్యమే గద్వాల్