అదో పెద్ద చెట్టు.దానిమీద బోలెడు పక్షులు గూళ్ళు కట్టుకుని తమ బుల్లి పిల్లలను పోషించుకుంటూ హాయిగా ఉన్నాయి.అలా కాకి దంపతులు గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకుని.అవి ఎప్పుడెప్పుడు పిల్లలు అవుతాయా వాటితో ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఉన్నాయి.
ఒకరోజు కోకిల కాకి గూడు దగ్గర ఒక కొమ్మ మీద కూర్చుని కాకి గూడులోకి చూడ సాగింది.దానిని ఆడ కాకి గమనించింది."పోనీలే చూస్తే ఏముంది" అనుకుంది.
రెండోరోజు కాకి దంపతులు ఆహార వేటకై వెళుతూ తమ గుడ్లు లెఖ పెట్టుకుంటే అవి నాలుగు ఉన్నాయి.ఆప్యాయంగా వాటివైపు చూసి అవి వెళ్ళి పోయాయి.
తిరిగి తిరిగి సాయంత్రంవచ్చే సరికి వాటి గూటిలో ఐదు గుడ్లు ఉన్నాయి! కాకి దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు! ఆడ కాకి కోకిలనే అనుమానిస్తూ,"ఈ గుడ్డు కోకిలదే అది నిన్న మన గూడువైపు చూస్తూ ఆ కొమ్మ మీద కూర్చుంది"అని చెప్పింది.
"ఎంత ధైర్యం దానికి మన గూట్లో దాని గుడ్డు పెడుతుందా?మనం కష్టపడి పొదగాలా?" అని ఖర్కశంగా అంది.
"దానికి బుద్ధి లేకపోవచ్చు లేదా అనుకోని కష్టం వచ్చి ఉండవచ్చు,దానికి కూడా తల్లి మనసు ఉంటుందికదా...దాపిని ఏడిపించడం ఎందుకు?మన గుడ్లతో పాటు ఆ గుడ్డును కూడా పొదుగుతాం,మనపిల్లలతో పాటు పెంచుదాం" చెప్పింది ఆడ కాకి.
"తల్లి మనసు తల్లికే తెలుస్తుంది...నిజంగా నీది దొడ్డబుద్ధి నీవు చెప్పినట్టు చేద్దాం" అని ప్రేమగా కోకిల గుడ్డు వైపు చూశారు కాకి దంపతులు.
దూరంగా కొమ్మ మీద కోకిల పాట పాడింది
****************
ఆర్యసోమయాజుల శరత్
Software engineer
9885668181
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి