పిల్లలం బడిపిల్లలం
కల్లలాడని వారలం
మల్లె మనసుల వారలం
పిల్లలం బడిపిల్లలం
ఆటలంటే మాకు ఇష్టం
అల్లరంటే మహా ఇష్టం
అమ్మ సుద్దులు ఆలకిస్తాం
అమ్మ ముద్దులు ఆరగిస్తాం
పిల్లలం బడి పిల్లలం
కల్లలాడని వారలం
కులమతమ్మలు మాకులేవు
పేద ధనికా బేధముండదు
ఎల్లరితొ స్నేహమ్ము చేస్తాం
అందరొకటై కలసివుంటాం
పిల్లలం బడిపిల్లలం
కల్లలెరుగని వారలం
చదవులందున పోటీ పడతాం
ఆటలందున అధిగమిస్తాం
మాటలూ చేతలూ ఒకటిగ
మాలో మేమే కలసిపోతాం
పిల్లలం బడి పిల్లలం
కల్లలెరుగని వారలం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి