జగత్తును రక్షించే జగన్నాథుడు
పూరిలోన కొలుయెను జగన్నాథుడు
భక్తుల కోర్కెలు తీర్చే జగన్నాథుడు
బలరామ సుభద్రలతో కొలువాయెను
// జగత్తును//
మహిమాన్విత విగ్రహంలో జగన్నాథుడు
మోక్ష మార్గం చూపును జగన్నాథుడు
ఆలయ పై భాగాన శ్రీచక్రము
అష్ట ధాతువులతో నిర్మాణ మయ్యెను
// జగత్తు//
ఆషాఢ శుద్ధ విదియ పూరి క్షేత్రం
మేళతాళాలతో ఘనమైన యాత్రలు
యేటేట భక్తులతో జగన్నాథుడు
రథంమీద ఊరేగు జగన్నాథుడు
// జగత్తు//
14 చక్రాల అమరిక రథము
నలుపదిమూడడుగుల అందాల రథము
రథచక్ర కదలిక కన్నుల విందూ
అత్యంత మహిమాన్విత రథయాత్రలు
//జగత్తు//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి