మూడు నేస్తాలు(బాల గేయం గేయ కథ);-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

చెట్టు మీద చిట్టి చిలుక
చెట్టు కింద గండు చీమ
చెరువు లోన చేపపిల్ల
చూడముచ్చటగున్నాయి

చిన్నగ చిలుక పలికింది
చీమ గబగబ వచ్చింది
చెరువు గట్టున చెరింది
చేప పిల్లను పిలిచింది

చేప నీటి గట్టు కొచ్ఛింది
చిలుక రివ్వున లేచింది
చెరువు గట్టున వాలింది
గట్టిగా గాలి వీచింది

చీమ నీటిలోకి జారింది
చేప పరుగులు తీసింది
చీమను వీపున ఆపింది
చిలుక రెక్కలు చాపింది
చీమను గట్టుకు చేర్చింది