విముక్తి(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 అందరూ కోరుకొనేది
కొందరికే దక్కేది
పీడిత,తాడితుల స్వప్నం
అణచబడ్డ జాతి ఎదురుచూసే నవోదయం
బానిస సంకెళ్ళు తెంపుకొని
సువిశాల లోకంలో సంచరించాలనే కాంక్ష
ఆంక్షల ముళ్ళకంచెలను తెంచుకొని
ముందుకెళ్ళాలనే లక్ష్యం
బాధల వలయాలను దాటుకొని
బ్రతుకు మార్గంలో పయనించాలనే ఆశ
వనరులను,సౌకర్యాలను దొంగిలించే
దుర్మార్గుల కబంధ హస్తాల నుండి
బయటకు రావాలనే తపన
దౌర్జన్యాల నుండి,మోసాల నుండి
తప్పించుకోవాలనే ఆర్తి
దోపిడి,ఆశ్రితపక్షపాతాల నుండి
విడివడాలనే ప్రయత్నం
విముక్తి కోసం చేసే యజ్ఞం
తనువు,మనసు ఉల్లాసంగా,ఉత్సాహంగా
ఎక్కడ ఉంటుందో అదే స్వేచ్ఛ
నిర్భయంగా,నిశ్చయంగా, నిమ్మళంగా
ఎక్కడ మనము ఉంటామో అదే స్వేచ్ఛ
ఎవరో వస్తారనే భ్రాంతి వదిలి
నీవు చేసే కృషే స్వేచ్ఛ.

కామెంట్‌లు