సీసమాలిక
వాల్మీకి యాజ్ఞచే వారిజాక్షుడు రామ
శివుని విల్లు విరిచె శీఘ్రముగను,
జనకుని పుత్రిక జానకి మాతను
పెండ్లి జేసుకొనెను ప్రేమతోడ,
తండ్రి మాట కొరకు తరలివెళ్లె వనము,
పదునాలుగేండ్లును భార మనక,
సాక్షాత్తు విష్ణువే జగమున జన్మించి
నడిచి చూపించె నరుని నడక,
కష్టాల సమయాన ఘనముగా జపియించ
శ్రీ రామ నామము చింత దీర్చు,
కోదండరాముని కొలువగన్ నిత్యము
జన్మరాహిత్యము జగతిలోన,
రామ నామమహిమ రమ్యమైనది జూడు
కొలువగ లేమురా కోట్ల విలువ,
తారక మంత్రాన్ని తనివిదీర పలుక
మోక్షప్రాప్తి కలుగు ముద్దు గాను.
తేటగీతి
ఒక్క భార్యయు, బాణము నొక్కటనియు,
తెలిపె రామచరితలోన ధీటుగాను,
రఘుకుల తిలకా ! రమణీయ రామచంద్ర!
నీకు నీరాజనమ్ములు నీలవర్ణ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి