ప్రాణదాతలు చెట్లు(షాడోలు):---గద్వాల సోమన్న

గొప్పవి తరువులు
చేయును సేవలు
పంచును మేలులు
త్యాగానికి గురుతులు గద్వాల్

నరకొద్దు చెట్లు
తరిగితే పాట్లు
ప్రగతికవి మెట్లు
అవి లేక ఎడారే గద్వాల్

తరుమును కరువులు
ఇచ్చును ఫలములు
తెచ్చును వానలు
వృక్ష సంపద మిన్న గద్వాల్

రక్షక భటులు
మహిలో తరులు
నిలుపు అసువులు
ప్రాణదాతలవి గద్వాల్

పెంచు వృక్షాలు
తరుము రోగాలు
మనకు కవచాలు
అందరిదీ బాధ్యత గద్వాల్

కామెంట్‌లు