సీసమాలిక
ప్రకృతి ప్రసాదము పరమౌషధము నీరు
సర్వ ప్రాణుల కెల్ల జగతి యందు,
పరమ గంగానది పావనంబు మనకు
పుడమి నందు ప్రజల పుణ్య జలము,
దేహమందున నీరు దేదీప్యముగ నుండ
ఆరోగ్యమును బెంచి హాయి పంచు,
నిత్యము శ్రద్ధతో నీరును త్రాగవలె
సర్వరోగ నివార్ని చక్కజేయు,
జలముయే ప్రాణము జగతిన జూడగన్
కలుషితమును జేయ కలుగు బాధ,
మొక్కలు బెంచుము ముదముతోదండిగన్
వానలు కురియును వసుధ నందు,
విశ్వమునంతయు విస్తరించి యుండెను
మూడు వంతుల నీరు ముచ్చటగను,
సస్యము జేయును సాగుభూమినిలన
పంటలు పండగ పావనమ్ము.
తేటగీతి
జలము తోడనే ప్రాణము జగతి యందు,
పొదుపు జేయుము తప్పక బొట్టు బొట్టు,
చెట్లు బెంచిన వర్షంబు జేరుధరణి,
మనిషి ప్రకృతితో ప్రేమగామసల వలెను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి