జాతిరత్నం(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

1)అగ్ని ధారతో తెలగాణ ఆర నిచ్చి
రుద్ర వీణను మోగించి రుధిర మిచ్చి
తిమిర సమరాన్ని చేయించి తీర్చె బాధ
జాతి రత్నమై నిలిచెను జనుల ముందు

2)అతని కవనము‌ రేపెను అగ్ని జ్వాల
రాజు‌ నెదిరించి నిలిచెను రాజ సముగ
జైలు గోడల మీదను జైత్ర యాత్ర
దాశ రథియాయె చైతన్య ధార వోలె
కామెంట్‌లు