మా చిన్నా కథలు.:-మాధవ సేవయే మానవ సేవ:-- కె. వెంకట రమణ రావు విశాఖ పట్టణం

 చిన్నా గుడికి వెళదాము ,ఇవాళ నీ పుట్టిన రోజు అంటూ చిన్నా ని గుడికి తీసుకెళ్ళాను
దారిలో చిన్నా వాళ్ళ స్నేహితుడు కనిపించాడు. హాయ్ హరీష్ అంటూ చిన్నాచెయ్యి ఊపాడు. హరీష్ ,వాళ్ళ నాన్న చెయ్యి విడిపించుకుని చిన్నా దగ్గరకి వచ్చాడు. ఎక్కడికి వెళుతున్నావు చిన్నా అని అడిగాడు . ఇవాళ నా పుట్టిన రోజు, నేను, మా నాన్నగుడికి వెళ్తున్నాము, నువ్వు వస్తావా అని అడిగాడు చిన్నా.లేదురా మేము ఇప్పడే ఒక అనాధ ఆశ్రమం కి వెళ్లి వస్తున్నాము. ఇవాళ మా నాన్న పుట్టిన రోజు. మా నాన్నకి చిన్నప్పుడే అమ్మ నాన్న లేరు. నాన్న ఆశ్రమం లో ఉండి చదువు కున్నారు. అందుకే ఇలా నాన్న తన పుట్టిన రోజుకి ఆశ్రమం కి వెళ్లి పిల్లలకి పళ్ళు స్వీట్స్, పాలు, ఇస్తారు. పాపం వాళ్ళు ఎంత ఇష్టం గా తింటారో చుస్తే చాలా సంతోషం వేసింది రా. మనం కూడా మన పుట్టిన రోజుకి అలానే చేద్దాము అంటూ హరీష్ వాళ్ళ నాన్న తో వెళ్ళిపోయాడు.
చిన్నా ,నాన్న గుడి కి వెళ్లారు. పూజారికి కొబ్బరికాయ పువ్వులు ఇచ్చి చిన్నా పేరు మీద పూజ చెయ్యమని చెప్పారు. 
చిన్నా అక్కడ చాల  పళ్ళు, పాలు చూసాడు.నాన్న ఇవి ఎవరికీ అని అడిగాడు. దేవుడికి అభిషేకం చేస్తారు చిన్నా అని చెప్పాడు వాళ్ళ నాన్న. అంటే మన ఇంట్లో లాగ దేవుడికి చూపించి అందరికి ఇచ్చేస్తారా ఈ పాలు, పళ్ళు అని అడిగాడు చిన్నా. లేదు చిన్నా ఇవి దేవుడి మీద పోస్తారు . తరవాత తీర్థం లా ఇస్తారు .
అయ్యో అదేంటి నాన్నా మనం మన ఇంట్లో దేవుడికి చూపించి తింటాము కదా ,అలాగే ఇవి కూడా అందరికి ఇస్తే మంచిది కదా అన్నాడు చిన్నా. అవును చిన్నా అలా చెయ్యచ్చు. సరే పూజ అయిపొయింది , పద ప్రసాదం తీసుకుని వెల్దాము ఇంటికి అంటూ చిన్నాని తీసుకుని ఇంటికి బయలు దేరాడు వాళ్ళ నాన్న.
చిన్నా మనసులో హరీష్ చెప్పిన విషయమే మెదులుతోంది . నాన్న ,అంటూ వాళ్ళ నాన్నని పిలిచాడు , మనం కూడా ఒక అనాధ ఆశ్రమం కి వెళ్లి పిల్లలకి ఏదైనా ఇద్దాము అన్నాడు.
మనం ఇంకొక సారి వెళదాము చిన్నా అన్నాడు నాన్న . కాదు మనం ఇవాళే వెళ్ళాలి అని పట్టు పట్టాడు చిన్నా ఇంక చేసేది లేక ఒక ఆటో రిక్షా ని పిలిచి తనకి తెలిసిన ఒక అనాధ ఆశ్రమం వైపు వెళ్ళమన్నాడు .
ఆశ్రమం లో అడుగు పెట్టగానే చిన్నా అక్కడ పిల్లలని చూసి చాల సంబర పడ్డాడు. వాళ్ళ తో కబుర్లు చెపుతూ ఈ లోకాన్ని మరచి పోయాడు. వాళ తో కలిసి భోజనం చేస్తా అని నాన్నకి చెప్పాడు . సరే అయితే అని చిన్నాని అక్కడే వదిలి వాళ్ళ నాన్న ఒక హోటల్ కి వెళ్లి పిల్లల్లకి భోజనం చెప్పాడు.
ఆ రోజు చిన్నా ఆ పిల్లలలతో చాలా ఆనందం గా గడిపాడు . 
ఇంటికి వేళ్ళ గానే చిన్నా వెలిగిపోతున్న మొహం చూసి వాళ్ళ అమ్మ ఏంటి విశేషం అని అడిగింది . వాళ్ళ నాన్న జరిగినది అంతా చెప్పాడు . అందుకేనా ఇంత ఆలస్యం అని వాళ్ళ అమ్మ చిన్నాని బాగా మెచ్చుకుంది . ఆ రోజు రాత్రి చిన్నా కి నిద్ర రాలేదు. రేపు ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకోవాలని ఉవ్విళ్ళు ఊరాడు
తరవాత రోజు వాళ్ళ క్లాస్ టీచర్ మానవ సేవయే మాధవ సేవ అన్న పాఠం చెప్పింది . లేని వారికీ ఉన్నవాళ్లు సహాయం చేస్తే అది దేవుడి కి సేవ చేసినట్టే అని టీచర్ చెప్పింది . మీలో ఎవరైనా ఏదన్నామంచి పని చేశారా అని అడిగింది . చిన్నా లేచి నిలబడి నేను చేశాను టీచర్ అని చెప్పాడు . చాలా సంతోషం నువ్వు ఎం చేసావో ఇలా టేబుల్ దగ్గరికి వచ్చి అందరికి చెప్పు అన్నది టీచర్ .
చిన్నా చాలా సంతోషం గా తన పుట్టిన రోజున వాళ్ళ నాన్న తో కలిసి అనాధ ఆశ్రమ పిల్లలతో  గడిపిన విషయం వాళ్ళ తో భోజనం చేసిన విషయాన్ని చెప్పాడు .
టీచర్ చిన్నా ని అభినందించింది . ఇలా అందరు కూడా మానవ సేవ చెయ్యాలి అని అందరికి చెప్పునది.
తప్పకుండ టీచర్ మేము ఇవాళ నుంచి లేని వాళ్ళకి మేము ఏదన్నా చేస్తాము మా అమ్మ నాన్నల తో చెప్పి అంటూ అందరూ ఏక కంఠం తో చెప్పారు.



కామెంట్‌లు