ఉన్నతమైన ఆదర్శం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అలనాటి సుప్రసిద్ధ సినీ నటుడు పృధ్వీరాజ్ కపూర్ మాస్కోలో యాత్ర ముగించుకుని వచ్చాడు.అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా. ఎవరో ఆయన్ని వ్యంగ్యం గా అడిగారు."మిష్టర్  పృధ్వీరాజ్! మీమాస్కోతీర్ధయాత్ర తర్వాత  ఎర్రజెండాకే సలాం కొడ్తానని మొక్కుకున్నారా?"దానికి ఆయన శాంతంగా అన్నాడు" ఆ!నేను ఎర్రజెండాని గౌరవిస్తాను.అది మాస్కోలో మాత్రమే ఎగిరే జెండాకి! భారత దేశం లో నాతల మువ్వన్నెల జెండా ముందు మోకరిల్లుతుంది"ఎవరూ నోరెత్తలేదు ఇంక!
రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్ర స్థాపకురాలు.ప్రఖ్యాత నర్తకి. 1977లో ఆమె తన బృందం తో కలసి హాలెండ్ లో నృత్యప్రదర్శనకై వెళ్లారు.  ఒకరోజు హోటల్ గది లో ఫోన్ గణగణమోగింది. ఆనాటి ప్ర ధాని మొరార్జీదేశాయ్ ఫోన్ చేసి డైరెక్ట్ గా అడిగారు "అమ్మా!మిమ్మల్ని  రాష్ట్రపతిపదవికి ఎంపిక చేశాను. మీఅభిప్రాయం తెల్పండి." ఆరాత్రంతా ఆమెకి నిద్ర పట్టలేదు.  తెల్లారగానే ఆయనకి ఫోన్ చేసింది"సర్!నన్ను క్షమించండి. నాకళకే నాజీవితం అంకితం. ఆపదవికి నేను అర్హురాలను కాను"అని సున్నితంగా తిరస్కరించారు. ఆపై టెలిగ్రాం ద్వారా  ఆవిషయాన్ని తెలిపారు ఆమె.పదవి కోసం తన కళను  వదులుకోని అపర విదుషీమణి.లేకుంటే 1977లోనే రుక్మిణిదేవి అరండేల్ తొలి మహిళా రాష్ట్రపతిగా అరంగేట్రం చేసేవారు.
కామెంట్‌లు