గురువే దైవము;-మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
 చంపకమాల
తరమును ధారవోయుఘన  దాతలు , దైవము   ధాత్రిలోపలన్ ,
గురువులు సూర్య చంద్రులయి గోముగ విద్యను బోధ జేయుటన్,
వరముగ దాల్చి వృత్తి నిల వాసిగ జ్ఞానము లందజేయుచున్,
నిరతము తీర్చిదిద్దు టకు నేర్పుగ శోధన జేయుచుండునే.
కందము.
కరమున  పొత్తము బూనియు
నిరతము చదివినను వచ్చు నేర్పుగ జదువుల్,
విరుల విధంబున విద్యలు
కరులను బాపికడతేర్చుఘనముగ నిలలో,
కందము.
గురు పాదములకు మ్రొక్కిన
వరములు గురు పించుతాను వసుధన నీకున్,
శిరమున వ్రాసిన వ్రాతలు
శరవేగముతోడ మారు శ్రద్ధగ జదువన్.


కామెంట్‌లు