ఆ పల్లెటూరిలో అధిక సంపన్నుడు పద్మనాభ రావు గారు. మంచి మనసున్న వ్యక్తి ఎవరికైనా నా కష్టం వచ్చిందని చెప్పగానే ఏదో ఒక సాయం చేసి ఇ పంపిస్తారు. 50 ఎకరాల పొలం నిత్యం పని మనుషులు.
ప్రత్యేకంగా చూడటానికి మల్లన్న ఉన్నాడు. ఎంతో కాలంగా తోటపని చేస్తూ నమ్ముకొని బ్రతుకుతున్నాడు. మల్లన్నకు తోట అంటే ప్రాణం పూల మొక్కల్ని చెట్లని చిన్నపిల్లల సాకినట్లు సాగుతాడు. ప్రతినిత్యం నీళ్లు పెట్టడం కలుపు మొక్కలు ఏరడం ఎండి రాలిపడిన ఆకుల్ని శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు తోటంతా పచ్చగా కళ కళ లాడే టట్లు ఉంచుతాడు. ఆ తోటలో రకరకాల గులాబీలు మల్లె జాజి పందిళ్ళు మందారాలు చంద్ర కాంత చామంతులు రకరకాల సంపెంగలు ఎటు చూసినా పూల పరిమళాలు వెదజల్లుతూంటుంది. మరొకవైపు మామిడి అరటి జామ పనస బొప్పాయి నారింజ వంటి పండ్ల చెట్లు ఏ సీజన్లో కాసేపు అన్ని ఉన్నాయి. ఎవరైనా చుట్టాలు బంధువులు ఇరుగు పొరుగు వారు వచ్చి పోతూ ఉంటే తోటలో కాసిన పండ్లు పూలు ఇచ్చి పంపిస్తుంటారు. ఎవరైనా అతిధులు వస్తే కూర్చుని మాట్లాడుకోవడానికి కుటీరం లాంటిది కట్టించారు. అచ్చం సినిమా సెట్టింగ్ లా ఉంటుందంటే నమ్మండి. మల్లన్న ఉదయం రకరకాల పూలు కోసి కొన్ని దేవాలయానికి పంపించి మిగిలినవి పూజకోసం అమ్మగారికి పళ్లెంలో పోస్తాడు. ఒరేయ్ మల్లన్న నీకు ఎంత పుణ్యం రా నిత్యం దేవుడికి పూలు ఉంటావు అంటుంది. నాదేముంది అమ్మా మీ తోటలో ఏ కదా అంటాడు. తోట సంరక్షణ మల్లన్న ది. ఏదో ఏదో మీ దయవల్ల మా కుటుంబం గడిచిపోతున్నది అంటూ అభిమానం వెల్లబుచ్చాడు. తా సంవత్సరం మామిడి చెట్లకి కాయలు బాగా కాస్తాయి మార్కెట్లో గిరాకీ పెరిగింది. తోటలో కాయ నీ కోయించి పెట్టమన్నాడు పద్మనాభరావు. మల్లన్న భార్య సాయం కూడా తోడు తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి కాయలని కోసి పెద్ద గోతాల కు ఎత్తారు. ఆ కాయలన్నీ చూడగానే సాయమ్మ కు ముదనష్టపు ఆలోచన వచ్చింది. ఏమయ్యా ఎప్పుడు చూసినా మీ అయ్యగారి కోసమే కష్ట పడతావు మనం పిల్లల గురించి ఆలోచించావా ఒక బస్తా కాయలు మార్కెట్ లో వేసి రా చేతికి డబ్బులు వస్తాయి ఖర్చులకు ఉంటాయండి. ఏందే ఎన్నడూ లేనిది కొత్త గా మాట్లాడుతున్నావు . దొంగతనం చేయమంటావా ఏంటి ఇలాంటి పాడు బుద్ది నీకు ఎందుకు పుట్టింది కళ్ళు పోతాయి లెంపలు వేసుకో మంటూ ఎత్తున ఎగిరి పడ్డాడు. అంతేలే పిల్లల బాగోగులు చూద్దామని లేదు నిజాయితీ కబుర్లు చెబుతూ కూర్చుంటే కాదు. బతకడం నేర్చుకోవాలి. ఒక గోతం కాయలు తగినంత మాత్రాన మీ అయ్య గారికి నష్టమేమీ రాదులే కష్టపడి చేస్తున్నావు తీసుకుంటున్నావు అని సర్ది చెప్పింది. ఇప్పుడంటే అన్నావు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నాకు చెప్పమాకు అంటూ పనిలో మునిగి పోయాడు. ఈ పల్లెటూర్లో తోట ని నమ్ముకుని కూర్చుంటే ఏం వస్తుంది పట్నంలో మా బావకి మిల్లులో ఉద్యోగం దొరికింది కాపురం అక్కడే పెడతారట. పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్ లో చేర్పించి బాగా చదివి ఇస్తారట ఎంతైనా నా సిటీ బతుకు సిటీ బతికే మనము ఉన్నాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావ్ అన్నాడు మల్లన్న. ఇంత చెప్పినా నా అర్థం కాలేదా మనము పట్నం వెళదాం మా బావతో చెప్పి నీకు కనిపించని అంటాను పిల్లల్ని బాగా చదివించు కోవచ్చు అంటూ బతిమిలాడింది.
ఈ పట్నం బతుకులు నాకు ఇష్టం లేదే హాయిగా తోట పని చేసుకుంటూ పిల్లల్ని ఇక్కడే చదివించు కొందాం మాత్రం ఊర్లో లేవా ఏంటి సుఖంగా గడిచిపోతున్న ప్రాణాన్ని కష్టాలు పాలు చేయమంటావా నాకు ఇష్టం లేదు అన్నాడు. మల్లన్న సాయమ్మ మాట వినలేదని అడిగింది. పట్నం వెళ్ళిన అక్క బావ నెలరోజులకే తిరిగి వచ్చారు మిల్లులో పని చేయడం చాలా కష్టంగా ఉండేది. ఆ వాతావరణం పడక ఊపిరితిత్తులు శ్వాస ఆడక పోవడం తో ఆస్పత్రి పాలయ్యాడు. పట్టణంలో పలకరించే దిక్కు లేదు. అప్పిచ్చే నాధుడు కనిపించలేదు. ఉన్నది కాస్తా ఖర్చు పెట్టుకొని తిరిగి వచ్చారు. దూరపు కొండలు నునుపు అనే సామెత ఊరికే అన్నారా పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. సాయమ్మ ఇంకెప్పుడూ పట్టణం గురించి అడగలేదు. తోట పట్టుంటే జీవితం హాయిగా గడిచిపోతుందని అనుకున్నది. మల్లన్న కూడా అ తోటను అంటిపెట్టుకుని ఉన్నాడు. తోట పట్టుంటే కుటుంబం గడిచి పోతుందని నమ్మకం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి