"మాఊరు"--వై. నీరజారెడ్డి .తెలుగు భాషో పాధ్యాయురాలు. జడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి.

ఒక్కసారి మా పల్లెకు వెళ్లి రావాలి. 
పచ్చని పొలాలను చూసి రావాలి. 
పైరగాలి తో ముచ్చట్లాడాలి. 
ఊరి చెరువుతో ఊసులాడాలి. 

ఇంటి బావిలోని నీళ్లు తాగాలి. 
వేప చెట్టు నీడలో సేద తీరాలి.
 కోయిలమ్మ పాటతో గొంతు కలపాలి. 
మఱ్ఱిచెట్టుఊడలతో ఊయలూగాలి. 


చిన్ననాటి నేస్తాలని కలవాలి. 
తీయని జ్ఞాపకాలు నెమరు వేయాలి. 
మా పల్లె సీమ చల్లగు0డాలి. 
పచ్చని పైరుల కళకళలాడాలి.

 మా ఊరి మధుర ఫలాల0 జ్ఞానజ్యోతి వెలుగుల0. 
రణము నందు వీరులం. భరతమాతకు మణిహారాల0.
కామెంట్‌లు