సంస్కారం మనిషి లక్షణం-జెగ్గారి నిర్మలసిద్దిపేట

 సీసపద్యం

సంస్కార మెప్పుడు సన్మార్గ మిచ్చును
వినయ విధేయతే విజయ మిచ్చు
ఉత్తమ గుణములు నోర్పుతో నేర్వగన్
అద్భుత శక్తులు నందు నెపుడు 
చిన్నతనము నుండె చిగురిస్తే సద్గుణం
ఉత్తములైవెల్గునుర్వినందు
ధనము తో నెప్పుడు ధరణిలో వెల్గరు
మానవత్వముచేత మాన్యుడౌను
ఆ.వె
ధర్మ గుణముచేత ధరణిలో వెల్గిన
వంశ కీర్తి వచ్చు వసుధనందు
పేద ధనిక యనెడి భేద భావము లేక
మనసుబెట్టి జూడ మంచి దౌను