లేగ దూడలు -సమ్మోహనాలు :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
అవ్వాయి తువ్వాయి 
తువ్వాయి వరమోయి 
వరమంటి లేగలివి రైతులకు ఓఉమా!

చెంగు చెంగున గెంతు 
గెoతు ఆవుల సంతు 
సంతుయే పాడిగా పంటగా ఓ ఉమా!

లేత గడ్డియు పండు 
పండు తిన ముందుండు 
ముందుగా గారాల నందులే ఓ ఉమా!


కామెంట్‌లు