నేను చేసే మంచి పనులు...;అచ్యుతుని రాజ్యశ్రీ

 ఈరోజు ఆదిత్య  తను చేసే  మంచి పనులను గూర్చి  ఒక పేజీ రాసుకొచ్చాడు."నేను  ఇంటి కెళ్ళినాక సాక్స్ స్కూల్ డ్రెస్  మార్చుకుని    వాటిని ఉతికేస్తాను. నాకు ఉన్నవి రెండు జతలు.పొద్దున్నే  అమ్మ వంటపని లో బిజీగా ఉంటుంది. సాక్స్ రోజూ  ఉతక్కపోతే దుర్వాసన వస్తుంది. డ్రెస్  తెల్లారి ఆరుతుంది కాబట్టి  అమ్మ  ఇస్త్రీ  చేసి ఉంచుతుంది  ఎల్లుండికి సిద్ధంగా. పాలు తాగేసి ఏదన్నా  పండు తిని ఆరు గంటల దాకా  ఆడుకుంటాను. ఇంటికి వచ్చి  స్నానం చేసి  హోం వర్క్  పూర్తి చేస్తాను. అమ్మ దగ్గరకి ట్యూషన్ పిల్లలు వస్తే  వారికి  సాయం  చేస్తాను.   శనివారం సాయంత్రం  గుడిలో భజనలు చేస్తాము పిల్లలు అందరం.ఆమర్నాడు  ఆదివారం బస్తీలోపిల్లలకి  పళ్ళు పంచి వారిచేత  కథలు పాటలు చెప్పించుతాము.పండుగ రోజు న అంతా ఆటపాటలతో గడపటానికి  ఏదైనా  అనాధ శరణాలయంకి వెళ్ళి వారికి పళ్ళు  స్వీట్స్  ఇస్తాము.మంచి దుస్తులు సేకరించి  పంచుతాము.మా పుట్టినరోజు వేడుకలు  పార్టీ ఫంక్షన్స్ అనిగాక ఆ డబ్బు తో సబ్బు కొబ్బరినూనె పెన్సిల్ పెన్ను కొని పంచుతాము.దీని వల్ల నాకు ఎంతో  తృప్తి ఆనందం. "శభాష్  ఆదిత్య  అని అంతా మెచ్చుకున్నారు.