పూల మొక్కలు (బాల గేయం):-పెందోట వెంకటేశ్వర్లు , సిద్దిపేట

వర్షాకాలం వచ్చింది 
తొట్లను తెప్పించింది
పూల మొక్కలు పెట్టింది
పెంచె భాద్యత తనదంది

మనసుకు ఎంతో నచ్చింది
పూసిన పూలను చూపింది
దేవుని పూజకు ముందుంది
వనితల చేతిలో మురిసింది

రంగురంగుల పూవులతో 
చిన్న పెద్ద ఆకృతులతో 
కంటికి చక్కని విందైంది.
మనసునుత్సాహపరిచింది.
కామెంట్‌లు