శ్రమజీవి(కైతికాలు):-పసుల.శంకర్- బయ్యారం-జయశంకర్ భూపాల్ పల్లి.
ముదిమి వయసులోనైన..
కష్టము తప్పకుండెను..
కడుపున పుట్టినోల్లు..
పట్టించుకోకుండెను..
అయ్యయ్యో తల్లి..!
ఆదుకునేవారు కరువాయెనా.!!

తనువు భారమైన..
తప్పకుండె కష్టము..
తనయుల దూరం పెట్టిన..
తప్పదాయె జీవనము
అయ్యయ్యో బామ్మా..!
శ్రమజీవి నీవమ్మా...!!

మూడు కాళ్ళతో బామ్మ..
చేసె బతుకు పోరాటము..
ముసలి వయసులో అమ్మ..
అపకుండె ఆరాటము..
వారెవ్వా ముసలమ్మ..!
వందనాలు నీకమ్మా..!!

కట్టెల మోపునమ్మ.
వీపునా మోస్తుండె..
భారమని ఊకుంటే..
బతుకు సాగకుండె..
అయ్యయ్యో బామ్మ.!
తీరకపాయె కష్టాలమ్మ..!!