నేస్తాలు రారండి.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 రండి రండి ‌ రారండి
నేస్తాలు లారా రారండి.
నేల బండ గోటీ బిళ్ళ
తొక్కుడు బిళ్ళ చెమ్మ చెక్క
దాగుడుమూతలు దండాకోరు
కోతి కొమ్మచ్చి కర్ర బిళ్ళ
అంతా కలిసి ఆడుదాము
మన శక్తుల నేమో చూపుతాము
కబాడీ క్రికెట్ పరుగు పందెం
వీరి వీరి గుమ్మడి పండు
అల్లీ బిల్లీ చెమ్మ చెక్క
కొత్త కొత్తగా ఆటలు నేర్చుకుందాం
ఆరోగ్యంగా పెరుగు దాం
పచ్చని చెట్లు చల్లటి గాలి
పరిశుభ్రంగా ఉంచుకుందాం
ఎగిరి దూకి ఆటలు ఆడుదాం
వ్యాయామం చేద్దాం
బలాన్ని శక్తిని ఇచ్చే ఆటలు
చేస్తా యంతో మేలును మనకు
నేస్తాలు రారండి ఆటలు ఎన్నో ఆడుదాం
కామెంట్‌లు